: రేపు చెన్నైకు వెళ్లనున్న విద్యాసాగర్ రావు!


తమిళనాడు ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు రేపు చెన్నైకు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఆయన రేపు మధ్యాహ్నానికి  చెన్నై రాజ్ భవన్ కు చేరుకుంటారని తెలుస్తోంది.  కాగా, ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, పన్నీర్ సెల్వం మధ్య హోరాహోరీ పోరు సాగుతుండటంతో, తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో గవర్నర్ వెలిబుచ్చనున్న నిర్ణయంతో ఈ అనిశ్చితి తొలగిపోతుందని పలువురు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News