: నా జీతం కంటే ఆ సీఈవో జీతమే ఎక్కువ... సమీక్షించండన్న ఆస్ట్రేలియా ప్రధాని


తన జీతం కంటే పోస్టల్ సీఈవో అహ్మద్ ఫాహుర్ జీతం చాలా ఎక్కువగా ఉందని, దీనిని పునఃపరిశీలించాలని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్ బుల్ పోస్టల్ శాఖను ఆదేశించారు. ఫాహుర్ జీతం 32 కోట్ల రూపాయలు. ఇది ప్రధాని జీతం కంటే పది రెట్లు ఎక్కువ. దీనిపై స్పందించిన పోస్టల్ శాఖ...అది కేవలం ఆయన జీతం మాత్రమే కాదని, అలవెన్సులు, ప్రోత్సాహకాలు అన్నీ కలిపి ఆయనకు అందే జీతమని తెలిపింది. 2016 ప్రారంభలో పోస్టల్‌ శాఖ నష్టాల్లో ఉండగా ఫాహూర్‌ దానిని లాభాల్లోకి తీసుకొచ్చారని చెబుతూ, వ్యాపారంలో పోటీ పెరుగుతున్నప్పుడు జీతాలు కూడా పోటీపడి చెల్లించాలని పోస్టల్‌ శాఖ స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News