: కొత్త నోట్లను రద్దు చేయండి.. దేవనాగరి లిపిలో ముద్రణ రాజ్యాంగ విరుద్ధం: డీఎంకే ఎంపీ డిమాండ్

1000, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన తరువాత ఆర్బీఐ వినియోగంలోకి తెచ్చిన 2000, 500 రూపాయల నోట్లను రద్దు చేయాలని డీఎంకే ఎంపీ తిరుచి శివ డిమాండ్ చేశారు. రాజ్యసభలో జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ, దేవనాగరి లిపితో ఆర్బీఐ ముద్రించిన నోట్లను రద్దు చేయాలని అన్నారు. దేవనాగరి లిపిని వినియోగించాలంటే పార్లమెంట్‌ లో చట్టం చేయాలని, అలా చట్టం చేసిన తరువాతే కొత్త నోట్లపై దేవనాగరి లిపిని ఉపయోగించడం రాజ్యాంగ పరిధిలోకి వస్తుందని అన్నారు.

అలా కాకుండా ఏకపక్షంగా దేవనాగరి లిపిని వినియోగించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం హిందీ భాష మాట్లాడేవారికి అనుగుణంగా ఉందని పేర్కొన్న ఆయన, అది ఇతర భాషల వారికి ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. కొత్త నోట్లను రద్దు చేయాలని, ఆర్బీఐ ముద్రించే నోట్లపై అంతర్జాతీయంగా చెల్లుబాటులో ఉన్న ఆంగ్ల సంఖ్యలను విధిగా ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. 

More Telugu News