: తొందరపడి వ్యాఖ్యలు చేయడం కంటే వేచిచూడడమే మంచిది: దీపా జయకుమార్
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తెలిపారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, ఈ పరిస్థితుల్లో ఏదో ఒక కామెంట్ చేయడం కంటే జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. తమిళ రాజకీయాల్లో దురదృష్టవశాత్తు ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. దీనిపై తొందరపడి ఏదో ఒక వ్యాఖ్య చేయాలని తాను భావించడం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను గతంలో చెప్పినట్టుగా ఈ నెల 24న తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తానని ఆమె మరోసారి ప్రకటించారు. ఈ లోపు తాను చెప్పినట్టు వచ్చే వదంతులను నమ్మవద్దని ఆమె సూచించారు. ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని ఆమె తెలిపారు.