: ట్రిపుల్ సెంచరీ హీరో మోహిత్ అహ్లావత్ కు బంపర్ ఆఫర్...ఐపీఎల్ లో ఛాన్స్


ఢిల్లీలో జరిగిన ఓ లోకల్ టీ20 టోర్నీలో కేవలం 70 బంతుల్లోనే 300 పరుగులు సాదించిన చిచ్చరపిడుగు మోహిత్ అహ్లావత్ (21) ను బంపర్ ఆఫర్ వరించింది. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ లో ఆటగాళ్ల కోసం నిర్వహించిన ట్రయల్స్ లో పాల్గొనేందుకు రావాల్సిందిగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఆహ్వానం పంపింది. దీంతో మోహిత్ జాతకం మారిపోనుందని కోచ్ సంజయ్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. సంజయ్ గతంలో గౌతమ్ గంభీర్, ఉన్ముక్త్ చాంద్ వంటి ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, సాధారణ రైతు కుమారుడిగా మోహిత్ క్రికెట్ పట్ల అత్యంత ఆసక్తి చూపేవాడని అన్నారు. మోహిత్ లో అద్భుతమైన టెక్నిక్ దాగుందని, ఢిల్లీ డేర్ డెవిల్స్ ట్రయల్స్ లో ఆకట్టుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వికెట్ కీపర్ గా కూడా అద్భుతంగా రాణిస్తాడని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News