: దుష్ట రాజకీయాలను ప్రోత్సహించొద్దు.. సాటి నటులు స్పందించాలి!: కమల హాసన్


తమిళనాడులో తాజా పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నటుడు కమలహాసన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరుస ట్వీట్లు చేశారు. దుష్ట రాజకీయాలను ప్రోత్సహించ వద్దని, తాజా సంక్షోభంపై నటులు తమ స్పష్టమైన వైఖరిని తెలపాలని అన్నారు. సమ్మతి లేదా అసమ్మతి ఏదైనా సరే, గట్టిగానే చెప్పాలని, ఈ సంక్షోభంపై నటుడు మాధవన్ దయచేసి స్పందించాలని కోరారు. దుష్ట రాజకీయాలపై మన గళం విప్పాలని, మాట్లాడకుండా ఉంటే కుదరదని సూచించారు. తమిళనాడు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయవద్దని, తమిళనాడు కోసం యావత్తు భారతదేశం అహింసా పద్ధతిలో పోరాడుతుందని కమల్ అన్నారు.

  • Loading...

More Telugu News