: తనను ప్రేమించట్లేదని యువతిని పొడిచిన యువకుడు!
తనను ప్రేమించట్లేదన్న కారణంతో ఓ యువకుడు తన పొరుగింటిలో ఉండే 20 ఏళ్ల యువతిపై దాడిచేసిన ఘటన కేరళలోని ఉదయంపెరూర్లో చోటు చేసుకుంది. ఆ యువతి మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు రావడాన్ని గమనించిన 25ఏళ్ల అమాల్ అనే వ్యక్తి పదునైన ఆయుధంతో ఆమెను పొడిచాడు. దీంతో రక్తమోడుతున్న ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఎర్నాకుళంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.