: పోనీ సోనియా, మన్మోహన్ సింగ్ లతో నేను మాట్లాడనా?: అద్వానీ


జాతీయ భద్రతకు సంబంధించిన కీలక బిల్లుల ఆమోదానికి ప్రతిపక్ష నేతలతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే.అద్వానీ ముందుకు వచ్చారు. ఎనీమీ ప్రాపర్టీ యాక్ట్ పై ఆర్డినెన్స్ లేదా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురావాలని, విపక్షాలు తమ ప్రయత్నాలను రాజ్యసభలో అడ్డుకుంటున్నాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ చట్టం ప్రకారం చైనా, పాకిస్థాన్‌ లకు పారిపోయిన శత్రువుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ ఆర్డినెన్స్‌ను లోక్‌ సభలో ఆమోదించారు. ఇప్పటికి ఈ ఆర్డినెన్స్ ను ఐదు సార్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో చివరి సారి ఆయన ఆర్డినెన్స్ పై అయిష్టంగానే సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందేందుకు అవసరమైతే తాను ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లాడుతానని ఎల్.కే.అద్వానీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, అనంతకుమార్ కు తెలిపారు. 

  • Loading...

More Telugu News