: టీవీ సీరియల్ షూటింగ్ లో అగ్నిప్రమాదం.. తోటి నటిని కాపాడిన నటుడు కుషాల్!
టెలివిజన్ హిందీ సీరియల్ ‘బేహద్’ షూటింగ్ లో అగ్నిప్రమాదం సంభవించడంతో తోటి నటి జెన్నీఫర్ వింగెట్ ను నటుడు కుషాల్ టాండన్ రక్షించాడు. ఈ విషయాన్ని కుషాల్ తన ఫేస్ బుక్ ఖాతా త్వారా తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. కల్యాణ మంటపంలో మంటలు చెలరేగుతున్నప్పటికీ జెన్నీఫర్ అక్కడే కూర్చుని ఉండగా, నటుడు కుషాల్ అక్కడికి వచ్చి ఆమెను పెళ్లి చేసుకునే సన్నివేశాన్ని షూటింగ్ లో భాగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో కల్యాణ మంటపంలో అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా వ్యాపించాయి. దీంతో, జెన్నీఫర్ ను రక్షించేందుకు కుషాల్ మెడకు, కాళ్లకు గాయాలు అయ్యాయి.