: ఏపీ రాజధాని అమరావతిలో తొలి ఐటీ ఆర్థిక వ్యవహారాల బీపీఓ!
ఏపీ రాజధాని పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఊరట కలిగించే వార్త. అమరావతిలో తొలి ఐటీ ఆర్థిక వ్యవహారాల బీపీఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. గన్నవరం మేథా టవర్స్ లో బీపీఓ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. 42 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఈ కేంద్రానికి కేటాయించారు. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా తొలి దశలో 350 మందికి ఉద్యోగాలు రానున్నాయి. కాగా, విజయవాడ, గుంటూరులో మరిన్ని బీపీఓ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.