: ‘సింగం 3’ చిత్రాన్ని లీక్ చేస్తామంటూ పైరసీ గ్రూప్ బెదిరింపులు!


ఇటీవల నిర్వహించిన ‘యమన్’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ‘సింగం 3’ నిర్మాత జ్ఞాన వేల్ రాజా చేసిన వ్యాఖ్యలపై ‘తమిళ్ రాకర్స్.కామ్’ అనే పైరసీ గ్రూప్ స్పందించింది. ఈ నెల 9న విడుదల కానున్న ‘సింగం 3’ చిత్రాన్ని లీక్ చేస్తామని సదరు పైరసీ గ్రూప్ తమ ఫేస్ బుక్ ఖాతా ద్వారా బెదిరింపులకు పాల్పడింది. ‘సింగం 3’ చిత్రం విడుదలైన రోజే లీక్ చేసి ఉదయం 11 గంటలకు సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తామని బెదిరించింది. ‘

'జ్ఞాన వేల్ రాజా సార్ బాగా మాట్లాడారు. మీ క్యాలెండర్ లో మార్కు పెట్టుకోండి. ఫిబ్రవరి 9 మీ రోజు కాదు, మా రోజు అని మీ క్యాలెండర్ లో మార్కు పెట్టుకోండి’ అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. కాగా, ‘యమన్’ ఆడియో కార్యక్రమంలో జ్ఞాన వేల్  ఇటీవల మాట్లాడుతూ, తాము అనుకున్న విధంగా ఈ సినిమాను చెప్పిన తేదీకి విడుదల చేస్తామో, లేదో తమకు తెలియదని, ‘తమిళ్ రాకర్స్.కామ్’ మాత్రం ఈ సినిమాను లీక్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతామని నమ్మకంగా చెబుతున్నారని అన్నారు. ఈ విషయమై తనతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మౌనంగా ఉందని, ఏమీ చేయడం లేదని ఆయన అనడం జరిగింది. కాగా, ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘సింగం 3’ చిత్రాన్ని హరి దర్శకత్వంలో తెరకెక్కించారు.

  • Loading...

More Telugu News