: తెలంగాణ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడికి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి, ఎల్.రమణ


తెలంగాణ టీడీపీ నేత‌లు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీ వెళ్లి, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో స‌మావేశ‌మయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వంపై వారు మంత్రికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసే ఇళ్లను తెలంగాణ స‌ర్కారు పేదలకు ఇవ్వడం లేదని వారు వెంక‌య్య నాయుడితో చెప్పారు. వారి నుంచి ఫిర్యాదును సేక‌రించిన వెంకయ్య నాయుడు దీనిపై విచార‌ణ చేసి, చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News