: తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళ నెటిజన్లు ఎవరిని కోరుకుంటున్నారో తెలుసా?
తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తమిళ రాజకీయాలు, భవిష్యత్ ముఖ్యమంత్రిపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్, ట్విట్టర్ మాధ్యమాల్లో మార్పు పేరిట రూపొందించిన వెబ్ సైట్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కేవలం రెండే రెండు ప్రశ్నలు అడిగింది. దానికి విశేషమైన ఆదరణ లభించింది. ఆ రెండు ప్రశ్నలు ఏంటంటే ‘తమిళనాడు సీఎంగా శశికళ కావాలా?' అన్నది మొదటి ప్రశ్న అయితే, రెండో ప్రశ్న 'పన్నీర్ సెల్వమే కొనసాగాలా?’ అంటూ రెండో ప్రశ్న సంధించారు. దీంతో పన్నీర్ సెల్వంనే ముఖ్యమంత్రిగా ఉంచితే మంచిదని ఎక్కువ మంది సమాధానం చెప్పారు.
అంతే కాకుండా తమిళనాడు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఎక్కువ మంది పేర్కొన్నారు. సుమారు 1.5 లక్షల మంది తమిళ నెటిజన్లు ఇదే అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజెప్పడం విశేషం. పార్టీ నేతల్లో శశికళకు ఎక్కువ మంది మద్దతు తెలుపుతుండగా, ప్రజలు మాత్రం శశికళను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాట ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి అందర్లోనూ రేగుతోంది.