: దేశ చరిత్రలో తొలిసారి... హైకోర్టు జడ్జిపై ధిక్కార నోటీసు జారీ చేసిన సుప్రీం


భారత దేశ చరిత్రలో ఓ హైకోర్టు న్యాయమూర్తిపై కోర్టు ధిక్కార నోటీసులను సుప్రీంకోర్టు జారీ చేసింది. కోల్ కతా హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న జస్టిస్ సీఎస్ కర్నన్ కు నోటీసులు జారీ చేస్తూ, ఆయనకు ఏ విధమైన న్యాయపరమైన పనులను అప్పగించరాదని, కోర్టు నిర్వహణ పనులకూ దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆర్డర్ కాపీలను తక్షణమే జస్టిస్ కర్నన్ కు పంపాలని, ఆయన టేబుల్ పై ఉన్న అన్ని ఫైల్స్ నూ హైకోర్టు రిజిస్ట్రార్ వద్దకు చేర్చాలని ఆదేశించింది.

అంతకుముందు అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గి తన వాదన వినిపిస్తూ, జస్టిస్ కర్నన్ భారత న్యాయ వ్యవస్థపై, సుప్రీం తీర్పులపై విమర్శలు గుప్పిస్తున్నారని, న్యాయమూర్తులు, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులపై ప్రధాని తదితరులకు లేఖలు రాస్తున్నారని, ఆయనపై కోర్టు ధిక్కార నేరం కింద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, గతంలో ఎన్నడూ జరగని విధంగా హైకోర్టు న్యాయమూర్తికి నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News