: ఇకపై ఆ తప్పు చేయను :మాయావతి
ప్రజలు తనకు మరోసారి అధికారం అప్పగిస్తే గతంలో చేసిన తప్పులు చేయనని బీఎస్పీ చీఫ్ మాయావతి హామీ ఇచ్చారు. ఘజియాబాద్ లో ఆమె మాట్లాడుతూ, గతంలో తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నానని అన్నారు. అందుకే తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. విగ్రహస్థూపాలు నిర్మించడం గానీ, సమాజ్ వాదీ పార్టీలాగా ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు ఉచితంగా పంచిపెట్టడంగానీ చేయబోమని స్పష్టం చేశారు.
దానికి బదులుగా పేదలకు, వెనుకబడిన వర్గాల ప్రజల ప్రాథమిక అవసరాలు తీరేలా ప్రత్యక్ష నగదు లబ్ధి పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు. కులాల ఆధారంగా కొనసాగుతున్న రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రయత్నించిన నాటి నుంచే బీజేపీ పతనం ప్రారంభమైందని ఆమె చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆమె ఆరోపించారు.