: శశికళకు మరోషాక్.. ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నిక చెల్లదు.. ఈసీ అభ్యంతరం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి జయలలిత మృతి అనంతరం నెలరోజులకే హడావుడిగా సమావేశం ఏర్పాటు చేసి, ఆ రాష్ట్ర అధికార అన్నాడీఎంకేకి కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. అంత హడావుడిగా ఎందుకు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారని ప్రశ్నించింది. అసలు అన్నాడీఎంకే నియమావళిలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి లేదంటూ వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు ఆ ఎన్నిక ఎలా చేపడతారని, అది చెల్లదని ప్రశ్నించింది. దీంతో శశికళకు మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకే నుంచి ఈసీ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.