: శశికళ వద్దకు వచ్చి అత్యుత్సాహం ప్రదర్శించిన 10 మంది కార్యకర్తలు.. అరెస్ట్!
చెన్నైలోని పోయస్ గార్డెన్లో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నివసిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, తమిళనాడులో గంట గంటకు మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా అక్కడకు చేరుకున్న పలువురు కార్యకర్తలు శశికళ ముందు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోరూర్‌కు చెందిన 10 మంది అన్నాడీఎంకే కార్యకర్తలు శశికళ ఫొటోను పట్టుకొని ఆమెను పొగడుతూ పాటలు పాడుకుంటూ అక్కడకు చేరుకున్నారు. దీంతో వారంతా పార్టీ కార్యకర్తలని భావించిన పోలీసులు వారిని లోపలికి పంపించారు. అయితే, ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించిన వారు దుస్తుల్లో దాచి ఉంచిన శంఖాలను బయటకు తీశారు. అనంతరం వాటిని అక్కడే ఊదారు. బాల్కనీలో నుంచి ఈ దృశ్యాలని చూసిన శశికళ షాక్ కు గురయ్యారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.