: శశికళకు పన్నీర్ సెల్వం తాజా సవాల్!
ఎంజీఆర్, జయలలిత చేతుల్లో ఎదిగిన అన్నా డీఎంకే పార్టీని కాపాడుకునేందుకు ఎంతో మంది శ్రమిస్తున్నారని, వారిలో తానూ ఒకడినని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. చేతనైతే పార్టీని విడదీసి చూపాలని శశికళకు ఆయన సవాల్ విసిరారు. ప్రజలంతా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారని, శశికళను ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలు అంగీకరించబోరని వ్యాఖ్యానించిన ఆయన, పార్టీ కోసం దీప తమతో కలసిరావాలని కోరారు. శశికళకు చేతనైతే అసెంబ్లీని సమావేశపరిచేలా చేసి, తన బలాన్ని చూపాలని సవాల్ విసిరారు. ఆమె వర్గం ఎమ్మెల్యేలు మినహా మరెవరూ మద్దతిచ్చేందుకు సుముఖంగా లేరని, ప్రజలు శశికళకు అత్యంత దూరమని అన్నారు. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేది తానేనని, పాలన సాగబోదని, సంక్షోభం ఏర్పడుతుందన్న భయాలు ప్రజలకు వద్దని అన్నారు. అన్నాడీఎంకే పార్టీకి శశికళ తాత్కాలిక కార్యదర్శి మాత్రమేనని అన్నారు. సెల్వంతో పాటు మీడియా సమావేశానికి పాండియన్, పొన్నుస్వామి తదితరులు హాజరయ్యారు.