: అమ్మ రక్తమే దీపలోనూ... ఆమె మద్దతు తీసుకుంటాను: పన్నీర్ సంచలన వ్యాఖ్య


దివంగత జయలలిత మేనకోడలు, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనమైన దీపా జయకుమార్ మద్దతు తీసుకుంటానని పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్య చేశారు. జయలలిత రక్తమే దీపలో కూడా ఉన్నదని, ఆమె అంగీకరిస్తే, తప్పకుండా ఆమె రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తానని సెల్వం వ్యాఖ్యానించారు. గవర్నర్ చెన్నైకి రాగానే తాను వెళ్లి కలిసి, జరుగుతున్న పరిణామాలన్నింటినీ వివరంగా తెలియజేస్తానని స్పష్టం చేశారు. పన్నీర్ సెల్వం తాజా వ్యాఖ్యలతో అటు దీప వర్గం కూడా ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇక తక్షణం శాసనసభను ఏర్పాటు చేస్తే, పార్టీని ఏకతాటిపై నిలిపే వారెవరో తెలుస్తుందని, పార్టీ చీలిపోతుందన్న భయాందోళనలు తనకేమీ లేవని ఆయన స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారాలు ఆపాలని శశికళ వర్గానికి చురకలు వేశారు. పన్నీర్ సెల్వం బల నిరూపణ వ్యాఖ్యలతో, ఆయన కోరితే డీఎంకే మద్దతిస్తుందన్న సంకేతాలు వెలువడ్డాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News