: రాంగోపాల్ వర్మ 'స్వీట్ ట్వీట్'పై స్పందించిన నాగార్జున


తనకు లైఫ్ నిచ్చిన 'శివ' చిత్రంలోని ఓ స్వీట్ మెమొరీని దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్న వేళ, హీరో నాగార్జున స్పందించాడు. 'శివ' చిత్రంలో 'కిస్ మీ రాంగ్ నంబర్' పాటను చిత్రీకరిస్తున్న వేళ, ఓ వైపు అమల, మరోవైపు నాగ్ కూర్చుండగా, వారికి మధ్యలో రాంగోపాల్ వర్మ నిలబడి సలహాలిస్తున్న  ఫోటోను రామ్ ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన నాగార్జున 'హాయ్ రామ్... ఎంత అద్భుత జ్ఞాపకాన్ని గుర్తు చేశావు. అయితే నేను సరైన నంబర్ నే కిస్ చేశాను' అని స్పందించాడు. దీనిపై రామ్, రీట్వీట్ చేస్తూ, 'ఆహా, అవును సార్' అని ఒప్పుకున్నాడు.

  • Loading...

More Telugu News