: ఇప్పుడు శశికళ వంతు... జయలలిత సమాధి వద్దకు


దివంగత జయలలిత సమాధి సాక్షిగా, పన్నీర్ సెల్వం రాజకీయ సునామీకి తెరలేపిన వేళ, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, జయలలిత సమాధి వద్దకు పయనమయ్యారు. నిన్న రాత్రి పన్నీర్ సెల్వం ఎక్కడి నుంచీ అయితే, తన తిరుగుబాటు బావుటాను ఎగురవేశారో, అక్కడికి వెళ్లి, తన స్నేహితురాలికి నివాళులు అర్పించి, ఆపై ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే మెరీనా తీరానికి అటు శశికళ వర్గీయులు, ఆమె వ్యతిరేకులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో, పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు పోలీసులను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News