: అన్నాడీఎంకే నిట్ట నిలువునా చీలిపోతోంది... మాకు అనుకూలంగా మార్చుకుంటాం: డీఎంకే


అధికార అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో నిట్ట నిలువునా చీలిపోనుందని, దీనికి తమను బాధ్యులను చేయవద్దని డీఎంకే వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీగా జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ మొత్తం రభస వెనుక కేంద్రం ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యాఖ్యలతో పన్నీర్ సెల్వం రెబల్ గా మారితే, ఆయనకు మద్దతిచ్చేందుకు సిద్ధమన్న సంకేతాలు డీఎంకే నుంచి వచ్చినట్లయింది. మరోవైపు పన్నీర్ అడుగుల వెనుక కథ, స్క్రీన్ ప్లే బీజేపీదేనని శశికళ వర్గం కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News