: చెప్పింది పది శాతమే... మిగతా 90 శాతం చెప్పేలా చెయ్యొద్దు: పన్నీర్ సీరియస్ హెచ్చరిక
తన మనసులో దాచుకున్న విషయాల్లో ఇంతవరకూ బయటకు చెప్పింది కేవలం పది శాతం మాత్రమేనని తమిళనాడు ఆపద్ధర్మ సీఎం ఓ పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి, అమ్మకు నిజమైన విశ్వాసపాత్రుడిని తానేనని చెప్పుకున్న పన్నీర్, మిగతా 90 శాతం బయటకు చెప్పేలా చేయవద్దని శశికళ వర్గానికి హెచ్చరికలు పంపారు. ఇప్పటికే తనతో బలవంతంగా రాజీనామా చేయించారని వ్యాఖ్యానించిన ఆయన, ఆసుపత్రిలో అమ్మను ఒక్కసారి కూడా తనకు చూపించలేదని, తాను నోరు విప్పితే అందరి బండారాలూ బయటపడతాయని అన్నారు. పన్నీర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.