: మోదీని పొగిడిన వ్యాపారిపై యువకుడి రాళ్ల దాడి !


‘అచ్చా దిన్ ఆయే హై’ అన్న కూరగాయల వ్యాపారిపై ఒక యువకుడు రాళ్లతో దాడి చేసిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఉస్మానాబాద్ జిల్లాలో కూరగాయలు విక్రయించే శివాజీ నారాయణ్ కర్.. బంగాళదుంపల ధర కిలో పది రూపాలయలకు తగ్గాయంటూ మోదీని పొగుడుతూ..  ‘అచ్చే దిన్ ఆయే హై’ అని గట్టిగా అన్నాడు. దీంతో, అక్కడే ఉన్న కాశీనాథ్ దేశ్ ముఖ్ అనే యువకుడు మండిపడ్డాడు. సదరు వ్యాపారిపై రాళ్లతో దాడి చేయడంతో, అతని తలకు గాయమైంది. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల, క్షతగాత్రుడి తలకు రెండు కుట్లు వేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

  • Loading...

More Telugu News