: భారత్ పై గెలవాలంటే చేయాల్సిందిదే: ఆసీస్ కు పాంటింగ్ సూచన


భారత్ ను భారత్ లో ఓడించాలంటే చాలా కష్టపడాలని సొంత జట్టుకు ఆస్ట్రేలియా జట్టు మాజీ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు. భారత్ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తోందని అన్నాడు. త్వరలో ఆసీస్ తో సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గణాంకాల ప్రకారం చూస్తే, సిరీస్ భారత్ వైపే ఉందని చెప్పాడు. అయితే క్రికెట్ లో ఏదీ అసాధ్యం కాదని గుర్తుచేశాడు. భారత్ ను భారత్ లో ఓడించాలంటే స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించాడు.

అలాగే వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచిన కోహ్లీని వీలైనంత చికాకుపెట్టాలని సూచించాడు. కోహ్లీని కట్టడి చేస్తే ఆసీస్ పని సులువవుతుందని చెప్పాడు. వన్డే ఫార్మాట్ లో తిరుగులేని ఆటతీరుతో ఆకట్టుకుంటున్న కోహ్లీ, టెస్టుల్లో ఇంకా దిగ్గజాల సరసన చేరలేదని స్పష్టం చేశాడు. భారత ఉపఖండంలో జరిగే నాలుగు టెస్టుల్లో గెలవాలంటే కోహ్లీని బ్యాటింగ్ లో అసౌకర్యానికి గురిచేయాలని రికీ పాంటింగ్ సూచించాడు. 

  • Loading...

More Telugu News