: పది రూపాయల నాణేలు ఉన్న వారు భయపడాల్సిన పనిలేదన్న ఆర్బీఐ!
పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావంటూ వస్తున్న వదంతుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. పది రూపాయల నాణేలు ఉన్న వారు భయపడాల్సిన పనిలేదని, వాటికి పూర్తి చట్టబద్ధత ఉందని, రోజు వారీ లావాదేవీల్లో నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అన్ని నాణేలు చెల్లుబాటు అవుతాయని, వీటిపై వచ్చే ఎటువంటి వదంతులను నమ్మవద్దని ప్రజలకు విఙ్ఞప్తి చేసింది. ఆ నాణేలు రిజర్వ్ బ్యాంక్ ద్వారానే చెల్లుబాటులోకి వస్తున్నాయని, ఎప్పటికప్పుడు పలు రూపాల్లో, డిజైన్లలో కొత్త నాణేలను ముద్రిస్తున్నామని అన్నారు. ఒకే సమయంలో ఈ తరహా నాణేలు కనిపించినంత మాత్రాన పాత వాటిని, కొత్త వాటితో పోల్చి చూసి లేనిపోని అపోహలకు, వదంతులకు గురికావద్దని ఆర్బీఐ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.