: విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తేసిన ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్


ఆస్ట్రేలియా జట్టు మాజీ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. గతంలో అనితరసాధ్యమైన విజయాలతో ఆసీస్ జట్టును అభేద్యమైన జట్టుగా నిలిపిన పాంటింగ్ కు స్లెడ్జింగ్ లో కూడా సాటి లేరు. అలాంటి పంటర్ (పాంటింగ్) కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ లో కోహ్లీని మించిన ఆటగాడు లేడని కితాబిచ్చాడు.

ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌ లో అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీయే అత్యుత్తమ ఆడగాడని స్పష్టం చేశాడు. కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని ఆరు నెలల క్రితమే తాను భావించానని చెప్పిన పాంటింగ్... ఇప్పుడు మరింత ఎత్తుకు ఎదిగాడని తెలిపాడు. టీమిండియాకు అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడంతో కోహ్లీ మరింత రాటుదేలుతాడని పంటర్ పేర్కొన్నాడు. కాగా, త్వరలో ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో పాంటింగ్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. 

  • Loading...

More Telugu News