: పవన్ కల్యాణ్ గారూ! రాజకీయాలు అంటే సినిమాల్లో ‘డూప్’ చేసినట్టు కాదండి: బీజేపీ నాయకుడు సురేంద్ర రెడ్డి


ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని, దానినే పట్టుకుని జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేలాడటం అవివేకమని భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్ర రెడ్డి హితవు పలికారు. తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ వెంకటస్వామి ఐదో వర్ధంతి సభ నిమిత్తం సూళ్లూరుపేటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘అయ్యా, పవన్ కళ్యాణ్ గారూ, రాజకీయాలంటే సినిమాల్లో డూప్ చేసినట్టుగా కాదండీ!. రాజకీయాల్లో సైడ్ యాక్టర్ లా పనిచేస్తే కుదరదు. సినిమాల్లో కాదు రాజకీయాల్లో రియల్ హీరోగా ఉండండి’ అని సూచించారు.

ఎన్నికల సమయంలో ఎన్డీఏకు సహకరిస్తారనని పవన్ కల్యాణ్ ముందుకు వస్తే తాము స్వాగతించామే తప్పా, ఆయన వల్ల ఏమీ అధికారంలోకి రాలేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ తోనే ఎక్కువ మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారని, ఈ విషయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ లు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసని సురేంద్ర రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News