: ‘కాటమరాయుడు’ టీజర్ నాకు బాగా నచ్చింది: సల్మాన్ ఖాన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ టీజర్ కు విడుదలైన మూడు రోజుల్లోనే 50 లక్షలకు పైగా హిట్స్ రావడంతో పాటు 1.76 లక్షల మంది నుంచి ‘లైక్స్’ వచ్చాయి. ఈ టీజర్ పై ఆయన అభిమానులే కాదు, బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కూడా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు. ‘కాటమరాయుడు’ టీజర్ తనకు బాగా నచ్చిందని, అందరినీ ఆకర్షిస్తుందని సల్మాన్ చెప్పాడు. కాగా, ఈ నెల 4న ఈ చిత్రం టీజర్ విడులైంది. పవన్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్న ఈ చిత్రానికి కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వం వహిస్తున్నారు.