: అరుదైన సవాల్ ను సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్న ఇస్రో!
ఈ నెల 15న ఒకేసారి ఒకే రాకెట్ ద్వారా 104 ఉప గ్రహాలను నింగిలోకి పంపేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ అరుదైన సవాల్ ను సాధించి చిరస్థాయి కీర్తిని తన ఖాతాలో వేసుకునేందుకు ఇస్రో ఉవ్విళ్లూరుతోంది. ఏపీలోని నెల్లూరులో ఉన్న సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి 15వ తేదీ ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్ వీ-సి 37 రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన కార్టో శాట్ -2 డి ఉపగ్రహం సహా 104 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మంగళ్ యాన్, చంద్రయాన్-1 వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను విజయవంతం చేసిన ఇస్రో, అదే ఆత్మవిశ్వాసంతో ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేసి ప్రపంచానికి తన సత్తా చాటాలని చూస్తోంది.