: పవన్ ‘కాటమరాయుడు’ టీజర్‌కు ఫిదా అయిపోతున్న అభిమానులు.. భారీగా వ్యూస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో వస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ‘ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు ఎవడున్నారన్నది ముఖ్యం’ అంటూ పవన్ వదిలిన ఒకేఒక్క డైలాగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు కనిపించని విధంగా విభిన్న లుక్కుతో పవన్ కనిపిస్తోన్న ఆ టీజర్ కు ఆయన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. టీజర్‌లో చూపించిన పవన్ ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్ ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుండడంతో ఈ నెల 4న విడుదలైన ‘కాటమరాయుడు’ చిత్రం టీజర్‌కు యూట్యూబ్‌లో 53 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి. ఈ టీజర్ ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. పవన్ సరసన శ్రుతిహాసన్ నటిస్తోన్న ఈ చిత్రం వచ్చేనెల విడుదల కానుంది.