: ప్రధాని మోదీని కలిసి, థ్యాంక్స్ చెప్పిన అమరావతి రైతులు


ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం నిమిత్తం భూములు ఇచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు నిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ కృతఙ్ఞతలు తెలిపారు. రైతుల వెంట కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. ఈ సందర్భంగా రైతుల తరపున ప్రధానిని గల్లా జయదేవ్ సన్మానించారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు కాల పరిమితిని పొడిగించాలని రైతులు ప్రధానికి విఙ్ఞప్తి చేశారు.
 

  • Loading...

More Telugu News