: ఆ చిన్నారికి ఎక్కించిన సెలైన్ లో పురుగులు లేవు.. సహజ మరణమే: మంత్రి లక్ష్మారెడ్డి


జనగామకు చెందిన ఓ చిన్నారికి గాంధీ ఆస్పత్రి వైద్యులు పురుగులు ఉన్న కలుషిత సెలైన్ ఎక్కించడంతో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. రెండు నెల‌లకు పైగా ప్రాణాల‌తో పోరాడిన ఆ చిన్నారి చివరకు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘ‌ట‌న‌పై ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుండ‌డంతో తెలంగాణ‌ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. చిన్నారి ప్రవళిక మృతిని వివాదాస్పదం చేయడం సరికాదని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రవళికది సహజమరణమే అని పేర్కొన్నారు. ఆ చిన్నారి కుటుంబసభ్యులను తాము బెదిరించలేదని అన్నారు. సెలైన్ బాటిల్ లో పురుగులు ఉన్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయ‌న చెప్పారు. ప్ర‌వ‌ళిక తండ్రి కావాలనే త‌మ‌పై ఆరోపణలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.  

మ‌రోవైపు నీలోఫ‌ర్ ఆసుప‌త్రిలో బాలింతల మృతిపై లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... ఈ ఘ‌ట‌న‌ల‌పై తాము స‌మ‌గ్ర‌స్థాయిలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. అందుకు సంబంధించిన‌ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News