: సీఎంగా శశికళ ప్రమాణ స్వీకార నిర్ణయంపై ఉత్కంఠ: రేపు ఢిల్లీకి బయలుదేరనున్న డీఎంకే నేతలు
కొన్ని రోజుల క్రితమే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళ నటరాజన్ ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ప్రయత్నిస్తుండడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయమై తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై డీఎంకే మరింత ముందుకు వెళ్లాలని భావిస్తోంది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించాలనుకుంటున్న శశికళ నిర్ణయానికి వ్యతిరేకత తెలుపుతూ రేపు ఆ పార్టీ నేతలు ఢిల్లీకి బయలుదేరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని నిర్ణయించుకున్నారు. ఆమె ప్రమాణస్వీకారం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ముందు అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.