: 'కాటమరాయుడు' ఇంట్రడక్షన్ సాంగ్ ఆన్ లైన్లో లీక్!


పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు'లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అంటూ ఓ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా తయారైన ఈ పాట నిజంగానే సినిమా కోసం రూపొందించినదా? లేక ఎవరైనా అభిమానులు తయారు చేసినదా? అన్న విషయం తెలియరానప్పటికీ, వెస్ట్రన్ బీట్ తో గత పవన్ చిత్రాల్లోని ఇంట్రడక్షన్ పాటల మాదిరిగానే ఉండటంతో, అభిమానులు దీన్ని ఆనందంగా విని, బాగుందని కితాబిస్తున్నారు. ఈ పాట అధికారికమా? కాదా? అన్న విషయమై చిత్ర నిర్మాతలు ఇంకా స్పందించలేదు. ఇక మొన్న విడుదలైన సినిమా టీజర్ 57 గంటల్లో 5 మిలియన్ వ్యూస్ సాధించి తెలుగు చిత్రాలకు సంబంధించిన పాత రికార్డులను బద్దలుకొట్టింది.

  • Loading...

More Telugu News