: పార్లమెంటులో ట్రంప్ ప్రసంగించేందుకు అనుమతించేది లేదు: బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్
పలు సంచలన నిర్ణయాలు తీసుకొని అసహనం తెప్పిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ తమ స్పందనను తెలియజేస్తూ తమ పార్లమెంటులో ట్రంప్ ప్రసంగించేందుకు అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ట్రంప్‌కు స్వాగతం సైతం పలకబోమని అన్నారు. తాము డొనాల్డ్ ట్రంప్‌లా జాతి, లింగ వివక్షలు కనబరిచే వారికి వ్యతిరేకమని చెప్పారు.
కామన్స్‌లో ట్రంప్ ప్రసంగించడాన్ని తాము చాలా గట్టిగా వ్యతిరేకిస్తామని, అక్కడ ప్రసంగించడమనేది ఊరికే వచ్చే అవకాశం మాత్రం కాదని వ్యాఖ్యానించారు. గౌరవ ప్రదంగా మాత్రమే దాన్ని అందుకోగలమని పేర్కొన్నారు. వలసదారులపై నిషేధం విధించడానికి ముందే డొనాల్డ్ ట్రంప్ వెస్ట్ మినిస్టర్ హాల్‌లో ప్రసంగించడాన్ని తాను వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకించానని,
ఇప్పుడు దానిని మరింతగా సమర్థిస్తున్నానని, తనతో పాటే ఎంతో మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.