: టెక్కీలకే ప్రాధాన్యం... యూఎస్ లో మంచి సంపాదననిచ్చే ఉద్యోగాల జాబితా!
అమెరికాలో మంచి సంపాదనతో పాటు, భద్రతను, ఉద్యోగ వృద్ధిని అందించే ఉద్యోగాల జాబితాను నెట్ వర్కింగ్ సైట్ లింకెడిన్ ప్రకటించింది. ఈ జాబితాలో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు ముందు నిలిచాయి. ఇదే సమయంలో హెల్త్ కేర్, ఆతిథ్య, ఫార్మా రంగాలూ మెరుగైన ఉద్యోగాలను అందిస్తున్నాయని వెల్లడైంది. లింకెడిన్ వెల్లడించిన 'మోస్ట్ ప్రామిసింగ్ జాబ్స్ ఇన్ యూఎస్ ఫర్ 2017' వివరాలివి...
ఆరోగ్యరంగం:
సగటు బేసిక్ వేతనం: 2,22,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 1000 (87 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 6.0
ఉండాల్సిన నైపుణ్యాలు: హెల్త్ కేర్ మేనేజ్ మెంట్, ఇన్ పేషంట్ కేర్, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్, రోగుల భద్రత, ఇంటర్నల్ మెడిసిన్స్.
ఔషధరంగం:
సగటు బేసిక్ వేతనం: 1,23,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 3300 (45 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 5.0
ఉండాల్సిన నైపుణ్యాలు: మెడికేషన్ థెరపీ మేనేజ్ మెంట్, కమ్యూనిటీ ఫార్మసీ, పేషంట్ కౌన్సిలింగ్, ఫార్మసీ ఆటోమేషన్.
సేల్స్ ఇంజనీర్:
సగటు బేసిక్ వేతనం: 80,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 3000 (159 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 6.0
ఉండాల్సిన నైపుణ్యాలు: సొల్యూషన్ సెల్లింగ్, సేల్స్ మేనేజ్ మెంట్, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ం ఆటోమేషన్, సేల్స్ ఇంజనీరింగ్.
సైట్ రిలయబిలిటీ ఇంజనీర్:
సగటు బేసిక్ వేతనం: 1,41,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 300 (97 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 8.0
ఉండాల్సిన నైపుణ్యాలు: లైనెక్స్, పైథాన్, బాష్, అపాచీ, షెల్ స్క్రిప్టింగ్.
ప్రొడక్ట్ మేనేజర్:
సగటు బేసిక్ వేతనం: 97,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 3000 (11 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 8.0
ఉండాల్సిన నైపుణ్యాలు: ప్రొడక్ట్ డెవలప్ మెంట్, కాంపిటేటివ్ అనాలిసిస్, ప్రొడక్ట్ లాంచ్, క్రాస్ ఫంక్షనల్ టీమ్ లీడర్ షిప్, మార్కెటింగ్ స్ట్రాటజీ.
ఫైనాన్షియల్ అనలిస్ట్:
సగటు బేసిక్ వేతనం: 1,29,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 2,500 (27 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 8.0
ఉండాల్సిన నైపుణ్యాలు: అకౌంటింగ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఫైనాన్షియల్ మోడెలింగ్ం వేరియన్స్ అనాలిసిస్, ఫోర్ కాస్టింగ్.
టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్:
సగటు బేసిక్ వేతనం: 1,29,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 500 (49 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 7.0
ఉండాల్సిన నైపుణ్యాలు: ఏజిల్ మెథడాలజిక్స్, సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లైఫ్ సైకిల్, క్లౌడ్ కంప్యూటింగ్.
ప్రోగ్రామ్ మేనేజర్:
సగటు బేసిక్ వేతనం: 97,400 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 2,300 (17 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 7.0
ఉండాల్సిన నైపుణ్యాలు: ప్రొడక్ట్ మేనేజ్ మెంట్, ప్రాజెక్ట పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్, ప్రాజెక్ట్ డెలివరీ, వెండార్ మేనేజ్ మెంట్, బిజినెస్ ప్రాసెస్ ఇంప్రూవ్ మెంట్.
డేటా ఇంజనీర్:
సగటు బేసిక్ వేతనం: 1,05,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 900 (85 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 8.0
ఉండాల్సిన నైపుణ్యాలు: హదూప్, పైథాన్, ఎస్క్యూఎల్, బిగ్ డేటా, హైవ్.
స్క్రమ్ మాస్టర్:
సగటు బేసిక్ వేతనం: లక్ష డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 400 (104 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 8.0
ఉండాల్సిన నైపుణ్యాలు: ఏజిల్ మెథడాలజిక్స్, సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, స్క్రమ్, రిక్వయిర్ మెంట్స్ అనాలిసిస్, ఎస్క్యూఎల్.
వీటితో పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు (94 వేల డాలర్లు), క్లినికల్ నర్స్ (75,700 డాలర్లు), ఫిజీషియన్ అసిస్టెంట్ (1,04,000 డాలర్లు), బిజినెస్ అనలిస్ట్ (70 వేల డాలర్లు), టాక్స్ మేనేజర్ (1,03,000 డాలర్లు), డాటా ఆర్కిటెక్ట్ (1,22,000 డాలర్లు), అనస్థటిస్ట్ (1,56,000 డాలర్లు), అనలిటిక్స్ మేనేజర్ (1,09,000 డాలర్లు), కస్టమర్ సక్సెస్ మేనేజర్ (72 వేల డాలర్లు), మెడికల్ డైరెక్టర్ (2,30,000 డాలర్లు) తదితర ఉద్యోగాలు నిపుణులకు స్వాగతం పలుకుతున్నాయని లింకెడిన్ వెల్లడించింది.