: ఐపీఎల్ వేలానికి వేళాయె... రూ. 2 కోట్ల క్లబ్ లో ఇషాంత్


ఐపీఎల్ వేలానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 20న జరిగే వేలంలో 799 మంది పోటీ పడనుండగా, వీరిలో 76 మందికి ఐపీఎల్ లో ఆడే అవకాశం లభించనుంది. భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, కనీస ధర రూ. 2 కోట్ల క్లబ్ లో ఉన్నాడు. ప్రస్తుత సీజన్ లో అత్యధిక కనీస ధర ఇదే. ఇక ఇషాంత్ తో పాటు ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్, ఆసీస్ బౌలర్లు మిచెల్ జాన్సన్, పాట్‌ కమిన్స్‌, ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, శ్రీలంక కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌ కూడా రూ. 2 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇంగ్లండ్ కు చెందిన బెయిర్ స్టో, న్యూజిలాండ్ కు చెందిన బౌల్ట్, ఆస్ట్రేలియాకు చెందిన లియాన్, హడిన్, దక్షిణాఫ్రికాకు చెందిన కైల్ అబాట్, వెస్టిండీస్ కు చెందిన జేసన్ హోల్డర్ ను రూ. 1.5 కోట్ల కనీస ధర పలకనున్నారు.

  • Loading...

More Telugu News