: కలుషిత సెలైన్ ఎక్కించిన ఘటనలో చిన్నారి సాయి ప్రవళిక మృతి.. ‘గాంధీ’ వైద్యుల నిర్వాకం!


గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్వాకంతో ఓ చిన్నారి మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయింది. ఆస్పత్రిలో చేరిన చిన్నారికి పురుగులు ఉన్న కలుషిత సెలైన్ ఎక్కించడంతో అస్వస్థతకు గురైన ఆమె 62 రోజుల చికిత్స తర్వాత తుది శ్వాస విడిచింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయికి చెందిన ప్రవళిక జ్వరంతో బాధపడుతూ డిసెంబరు 7న సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు పురుగులున్న కలుషిత సెలైన్ ఎక్కించారు. దీంతో కాసేపటికే ఆమె శరీరం రంగు మారింది. పరిస్థితి మరింత విషమించింది.

దీంతో అప్రమత్తమైన వైద్యులు చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా పరిస్థితిలో మార్పు రాలేదు. చివరికి రెండు నెలల తర్వాత పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ప్రవళిక మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె ప్రాణాలు తీసిందని గుండెలవిసేలా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాప పరిస్థితి రోజురోజుకు విషమిస్తున్నప్పటికీ రిపోర్టుల పేరుతో వైద్యులు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News