: పవన్ కల్యాణ్‌పై విద్యార్థి జేఏసీ మండిపాటు.. ట్వీట్లతో తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆగ్రహం


జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన జేఏసీ నాయకుడు అడారి కిషోర్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై నకిలీ ట్వీట్లతో విద్యార్థులు, యువతను పవన్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో లక్షలాదిమంది విద్యార్థులు, యువకులపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. తెలంగాణ ఉద్యమకారులకు భయపడిన పవన్ అప్పట్లో సమైక్య ఉద్యమాన్ని, అందులో పాల్గొన్న ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. తమిళనాడులో ‘జల్లికట్టు’ కోసం జరిగిన ఉద్యమం మాదిరిగా ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమిద్దామని చెబుతున్న పవన్.. మరి తమిళ హీరోల్లా ప్రజల్ని ఎందుకు ఆదుకోవడం లేదని కిషోర్ కుమార్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News