: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అయినా పోనిచ్చిన పైలట్.. ప్రయాణికులు సురక్షితం


ఎయిరిండియా పైలట్ ఒకరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విమానాన్ని పక్షి ఢీకొట్టినా లెక్క చేయకుండా ముందుకే  పోనిచ్చాడు. ఫలితంగా అందులోని 122 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలోకి వెళ్లిపోయాయి. అధికారుల జోక్యంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం భోపాల్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని టేకాఫ్ అయిన కాసేపటికే ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో నిబంధనల ప్రకారం విషయాన్ని అధికారులకు వివరించి సమీపంలోని విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేయాల్సి ఉంది. అయితే ఇవేమీ పట్టించుకోని పైలట్ విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ విమానాన్ని గమ్యస్థానం వైపు పోనిచ్చాడు. విషయం తెలిసిన ఎయిర్‌ పోర్టు అధికారులు జోక్యం చేసుకుని విమానాన్ని జైపూర్‌కు దారి మళ్లించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పైలట్ విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా దింపాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News