: పదవిపై పన్నీర్ విముఖత.. నచ్చజెప్పేందుకు సీనియర్లను పురమాయించిన శశికళ
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి శశికళకు మార్గం సుగమం చేసిన పన్నీర్ సెల్వానికి కీలక పదవి ఇవ్వాలని శశికళ భావిస్తుండగా, పన్నీర్ మాత్రం తనకు ఎటువంటి పదవులు వద్దని చెబుతున్నట్టు సమాచారం. పదవిపై విముఖత చూపుతున్న ఆయనకు నచ్చజెప్పేందుకు శశికళ సీనియర్లను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన పన్నీర్ సెల్వాన్ని తొలుత స్పీకర్ పదవిలో నియమించాలని శశికళ భావించారు. అయితే పాలనపై పట్టున్న ఆయనను అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి దూరం చేస్తే పాలనలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావించిన శశికళ ఉప ముఖ్యమంత్రి, లేదంటే ఆర్థిక, హోం శాఖల్లో ఏదో ఒకటి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అసలు తనకు పదవే వద్దని పన్నీర్ భీష్మించుకుని కూర్చున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.