: 6-ఎస్ ఐ ఫోన్లను వెనక్కి తెప్పించనున్న ‘ఆపిల్’!
యూఏఈలో విక్రయించిన 6 ఎస్ మోడల్స్ ఐ ఫోన్లను ఆపిల్ సంస్థ వెనక్కి రప్పించనుంది. ఈ మోడల్ ఫోన్లలో బ్యాటరీ సమస్యలు తలెత్తుతున్నాయనే వినియోగదారుల ఫిర్యాదుల మేరకు వాటిని వెనక్కి తీసుకోవాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. 2015లో చైనాలో తయారు చేసిన ఈ మోడల్ ఫోన్స్ వాటంతట అవే షట్ డౌన్ అయిపోతున్నాయనే ఫిర్యాదులూ అందాయని, తాము వినియోగించే 6 ఎస్ ఐ ఫోన్లలో బ్యాటరీ లోపం ఉందా? అనే విషయాన్ని పరిశీలించుకునేందుకు https://www.apple.com/ae/support/iphone6s-unexpectedshutdown/ ద్వారా పరిశీలించుకోవాలని యూఏఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ పేర్కొంది.