: జయలలిత మృతిపై డాక్టర్ల వివరణపై అనుమానాలు వ్యక్తం చేసిన మేనకోడలు దీప, నటి గౌతమి!


జయలలిత మృతికి సంబంధించి అపోలో డాక్టర్లు ఇచ్చిన వివరణపై ఆమె మేనకోడలు దీప, సినీ నటి గౌతమి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి తన ఆరోగ్య పరిస్థితి విషమించే వరకు పరీక్షలు చేయించుకోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. లండన్ తరలిస్తామన్న డాక్టర్ రిచర్డ్, తర్వాత మాట ఎందుకు మార్చారని, జయలలితను చూసేందుకు తనను అనుమతించలేదని తమిళనాడు గవర్నర్ తన ప్రెస్ నోట్ లో నాడు పేర్కొన్నారని, కానీ, గవర్నర్ ను చూసి జయ చేయి ఊపారని రిచర్డ్ ఎందుకు తప్పుదారి పట్టించారని ప్రశ్నించారు. జయకు చికిత్స చేసినందుకు గాను రూ.5.2 కోట్ల బిల్లును జయ కుటుంబ సభ్యులు చెల్లించారని చెప్పారని, ఆ బిల్లు ఎవరు చెల్లించారో తమకు చెప్పాలని దీప ప్రశ్నించింది.
 

  • Loading...

More Telugu News