: ‘టాటా సన్స్’ డైరెక్టర్ పదవి నుంచి మిస్త్రీ తొలగింపు
‘టాటా సన్స్’ డైరెక్టర్ పదవి నుంచి మిస్త్రీని తొలగించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) లో ఈ మేరకు ఆమోదం లభించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశానికి హాజరైన మెజారిటీ వాటాదారులు మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి ఆమోదం తెలిపారని పేర్కొంది. కాగా, గత ఏడాది డిసెంబర్ 19న టాటా గ్రూప్ లోని ఆరు నమోదిత కంపెనీలకు మిస్త్రీ రాజీనామా చేసిన విషయం విదితమే.