chandrababu: మంత్రి చినరాజప్పపై జోక్ వేసి, నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు


అమ‌రావ‌తిలోని పాతగుంటూరు, నగరంపాలెంలో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు ఉద‌యం ప్రారంభించారు. అనంత‌రం మాట్లాడుతూ అక్క‌డ న‌వ్వులు పూయించారు. తాము రాష్ట్రంలో హ్యాపీ సండే పెట్టామ‌ని, పోలీసులకు కూడా ఇది వర్తిస్తుందని ఆయ‌న వ్యాఖ్యానించారు. పోలీసులతో వ్యాయామం చేయించాలని, అది హోం మంత్రి చినరాజప్ప నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు అనడంతో అక్క‌డున్న వారంతా విర‌గ‌బ‌డి న‌వ్వారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇన్విజిబుల్ పోలీసింగ్ ఎక్కువగా ఉండాలని చంద్రబాబు అన్నారు. ఇక‌పై పోలీసులు దురుసుగా మాట్లాడితే చెల్లుబాటు కాదని సీఎం చంద్ర‌బాబు అన్నారు. కొంద‌రు రాజకీయ నేతలు పోలీసులను బెదిరిస్తుంటారని పోలీసుల వ‌ద్దకు వ‌చ్చి ఏ ప‌ని చేసినా అంతా రికార్డు అవుతుందని, అనంత‌రం త‌ప్పు చేసిన‌ వారికి శిక్షలు తప్పవని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎటువంటి చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌డానికి వీలులేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News