: పన్నీర్ సెల్వంకి తమిళనాడు మంత్రి వర్గంలో కీలక పదవి!


తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ఆమోదించి, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆ ప‌ద‌విలో కొన‌సాగాల‌ని ఆయనకు సూచించారు. అయితే, రేపే శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ ఆ రాష్ట్ర సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నార‌ని అన్నాడీఎంకే ప్ర‌క‌టించిన వేళ‌.. ప‌న్నీర్ సెల్వంకి ఆ రాష్ట్ర‌ మంత్రి వ‌ర్గంలో ఏ ప‌ద‌వి క‌ట్ట‌బెడతారనే చ‌ర్చ మొద‌లైంది. కాగా, ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన ఆయ‌న‌కు ఉప ముఖ్యమంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని తెలుస్తోంది. అలాగే ఆయనకు కీలక పోర్ట్ ఫోలియో దక్కే అవకాశముందని స‌మాచారం.

  • Loading...

More Telugu News