: ప్రత్యేక హోదా అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన విజయసాయిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశాన్ని ఈ రోజు రాజ్యసభలో లేవనెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై బీజేపీ యూటర్న్ తీసుకుందని, అధికారంలోకి రాకముందు ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా కావాలని మాట్లాడిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆ మాటను మరచారని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ ఇచ్చిన హామీని దాటేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. విభజన తరువాత రాష్ట్రం కష్టాల్లో చిక్కుకుందని ఆయన చెప్పారు. హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆర్థిక సంఘం కాదని ఆయన అన్నారు.
మరోవైపు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రలోభాలతో ప్రతిపక్ష పార్టీల నేతలను ప్రభుత్వ సభ్యులు ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు.