: కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన అలిస్టర్ కుక్


అందరూ ఊహించిందే జరిగింది. ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి అలిస్టర్ కుక్ తప్పుకున్నాడు. ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్ ను 0-4తో కోల్పోయిన వెంటనే రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు కుక్ ప్రకటించాడు. 2012లో ఇంగ్లండ్ కెప్టెన్ గా నియామకమైన కుక్ ఇప్పటి వరకు 59 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇంగ్లీష్ జట్టుకు అత్యధిక టెస్టుల్లో నాయకత్వం వహించిన ఘనత కుక్ దే. తన కెప్టెన్సీలో 2013, 2015లో యాషెస్ సిరీస్ లను గెలుపొందడం కుక్ సాధించిన గొప్ప విజయాలుగా చెప్పుకుంటారు. 2010-2014 మధ్యకాలంలో 69 వన్డేలకు కూడా కుక్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా కుక్ మాట్లాడుతూ, ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణమని చెప్పాడు. ఇకపై కూడా టెస్టు ప్లేయర్ గా కొనసాగుతూ, కొత్త కెప్టెన్ కు సహాయసహకారాలు అందిస్తానని చెప్పాడు. 

  • Loading...

More Telugu News