: కూతురు జీవా రెండవ జన్మదినాన్ని ప్రత్యేకంగా హిల్ స్టేషన్‌లో జరుపుకున్న ధోనీ
ఇంగ్లండ్‌తో టీమిండియా సిరీస్ ముగియడంతో మహేంద్రసింగ్ ధోనికి కాస్త ఖాళీ సమయం దొరికింది. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతున్నాడు. తన కూతురు జీవా ఈ రోజు రెండవ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ధోనీ తన భార్య సాక్షి సహా స్నేహితులతో కలిసి ఉత్తరాఖండ్ లోని ముస్సోరికి వెళ్లాడు. అక్కడే తన చిట్టి కూతురి పుట్టినరోజు వేడుకని సింపుల్ గా జరుపుకుంటున్నాడు. ధోని తండ్రి పాన్‌సింగ్ ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన వారన్న విషయం తెలిసిందే.